జీరా రైస్ అంటే చిన్నారుల నుంచి పెద్దల వరకు అందరికీ ఇష్టమైన వంటకం. లంచ్ బాక్స్‌కు, స్పెషల్ లంచ్‌కు లేదా ఇంటికి అతిథులు వచ్చినప్పుడు తక్కువ సమయంలోనే రుచికరంగా తయారయ్యే ఈ రెసిపీని ఇంట్లోనే హోటల్ స్టైల్‌లో చేసుకోవచ్చు. సరైన పద్ధతిలో చేస్తే అన్నం పొడిపొడిగా, సువాసనతో ఎంతో రుచిగా ఉంటుంది.
ఈ రెసిపీకి బాస్మతి బియ్యం లేదా సాధారణ బియ్యం, జీలకర్ర, పచ్చిమిర్చి, జీడిపప్పు, కరివేపాకు, కొత్తిమీర, నూనె, ఉప్పు, వైట్ పెప్పర్ పౌడర్ అవసరం. కావాలనుకుంటే కొద్దిగా టేస్టింగ్ సాల్ట్ (అజినోమోటో) కూడా వేసుకోవచ్చు. ఈ పదార్థాలతో రెస్టారెంట్ స్టైల్ ఫ్లేవర్‌ను సులభంగా పొందవచ్చు.
వంట చేయడం కొత్తగా నేర్చుకునే వారు కూడా ఈ రెసిపీని మొదటి ప్రయత్నంలోనే పర్ఫెక్ట్‌గా చేయవచ్చు. కొన్ని చిన్న చిట్కాలు పాటిస్తే జీరా రైస్ హోటల్‌లో దొరికే రుచితో, పొడిపొడిగా తయారవుతుంది. ఇక తయారీ విధానం తెలుసుకుని ఇంట్లోనే ఈ టేస్టీ రెసిపీని ట్రై చేయండి.








