E-PAPER

వెల్లుల్లి పొట్టు తీయడం కష్టమా? ఈ సింపుల్ కిచెన్ టిప్స్‌తో నిమిషాల్లో పని పూర్తి!

భారతీయ వంటకాల్లో వెల్లుల్లికి ప్రత్యేక స్థానం ఉంది. పప్పు, కూరలు, పచ్చళ్లు, చట్నీలు వంటి అనేక వంటకాలలో విరివిగా ఉపయోగించే వెల్లుల్లి రుచిని పెంచడమే కాకుండా ఆరోగ్యానికీ ఎంతో మేలు చేస్తుంది. ఇందులో అలిసిన్, విటమిన్ B6, విటమిన్ C, మాంగనీస్, సెలీనియం, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండటంతో రోగనిరోధక శక్తిని పెంచడంలో, గుండె ఆరోగ్యాన్ని కాపాడడంలో కీలక పాత్ర పోషిస్తుంది.

అయితే వెల్లుల్లిని వంటల్లో ఉపయోగించే ముందు దాని పొట్టు తీయడం చాలామందికి ఇబ్బందిగా ఉంటుంది. పలుచని పొర ఉండటంతో రెబ్బలపై ఉన్న తొక్క సులభంగా రాక సమయం ఎక్కువ పడుతుంది. ముఖ్యంగా ఒకేసారి ఎక్కువ వెల్లుల్లి రెబ్బలను శుభ్రం చేయాల్సి వస్తే ఈ పని మరింత కష్టంగా అనిపిస్తుంది.

అయితే కొన్ని సులభమైన కిచెన్ టిప్స్‌ను పాటిస్తే వెల్లుల్లి పొట్టును కేవలం కొన్ని నిమిషాల్లోనే సులభంగా తొలగించవచ్చు. చిన్న చిన్న చిట్కాలతో సమయాన్ని ఆదా చేసుకుంటూ ఈ పనిని చాలా ఈజీగా పూర్తి చేయవచ్చు. ఆ సింపుల్ టిప్స్ ఏంటో తెలుసుకుందాం.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News