E-PAPER

అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతలు మరింత తీవ్రం.. ఇరు దేశాల మధ్య వరుస దాడులు

మిడిల్ ఈస్ట్‌లో పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారుతున్నాయి. అమెరికా, ఇరాన్ ఒకదానిపై ఒకటి దాడులు కొనసాగిస్తున్నాయి. శుక్రవారం రాత్రి కూడా అమెరికా వరుసగా ఏడో రోజు ఇరాన్‌లోని పలు మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకుని దాడులు నిర్వహించింది. ఇరాన్‌లోని నిఘా కేంద్రాలు, సైనిక లాజిస్టిక్స్ కేంద్రాలు, భూగర్భ ఆయుధ నిల్వ సౌకర్యాలపై దాడులు జరిగినట్లు అమెరికా సెంట్రల్ కమాండ్ (CENTCOM) వెల్లడించింది.

మరోవైపు అమెరికా చర్యలకు ప్రతీకారంగా ఇరాన్ కూడా దాడులను ముమ్మరం చేసింది. జోర్డాన్‌లోని రెండు అమెరికా సైనిక స్థావరాలపై దాడులు జరిపినట్లు సమాచారం. ఈ దాడుల్లో పలువురు అమెరికా సైనికులు గాయపడినట్లు నివేదికలు వెలువడుతున్నప్పటికీ, దీనిపై అమెరికా అధికారులు ఇప్పటివరకు అధికారికంగా ధ్రువీకరించలేదు.

మిడిల్ ఈస్ట్‌లోని అమెరికా సైనిక స్థావరాలపై కొత్త దాడుల దశను ప్రారంభించినట్లు ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ (IRGC) ప్రకటించింది. సిరియా, కువైట్, ఒమన్, బహ్రెయిన్, జోర్డాన్‌లోని అమెరికా లక్ష్యాలపై దాడులు చేసినట్లు వెల్లడించింది. ఈ దాడులను అమెరికా పెట్రియాట్ క్షిపణి నిరోధక వ్యవస్థ పూర్తిగా అడ్డుకోలేకపోయిందని అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News