E-PAPER

గోదావరి చేపల వేటకు వెళ్లి మృతి చెందిన కుటుంబాలకు మాజీ ఎమ్మెల్యే పరామర్శ

ఎటపాక మండలం, (వై7 న్యూస్) జూలై 19:
పోలవరం జిల్లా ఎటపాక మండలం గొమ్ము కొత్తగూడెం గ్రామంలోని గోదావరిలో చేపల వేట కెళ్ళి ఐదుగురు మరణించిన సమాచారం అందుకున్న, రంపచోడవరం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే మరియు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి గౌరవ నాగులపల్లి ధనలక్ష్మి మృతుల కుటుంబాలను పరామర్శించి కుటుంబ సభ్యులను ఓదార్చారు.
చనిపోయిన కుటుంబ సభ్యులు రోజువారి వేట చేసుకుంటూ జీవనం కొనసాగించే నిరుపేద కుటుంబానికి చెందినవారు . మృతి చెందిన కుటుంబాలకు ఒక్కొక్కరికి కనీసం 10 లక్షల రూపాయలు ఎక్స్ గ్రేసియా రాష్ట్ర ప్రభుత్వము ప్రకటించి ఆదుకోవాలని కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున పూర్తి సహాయ సహకారాలు ఉంటాయని పార్టీ న్యాయం జరిగే వరకూ పోరాటం చేస్తామని భరోసా ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో ఎటపాక మండల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News