E-PAPER

భవానీ శంకర దేవాలయ పునర్నిర్మాణానికి రూ.50,199 విరాళం

మణుగూరు, జూలై 18 (Y7 న్యూస్ తెలుగు):

మణుగూరు మండలం అశోక్ నగర్‌లోని శ్రీ భవానీ శంకర దేవాలయ పునర్నిర్మాణానికి దాతలు ముందుకు వస్తున్నారు. ఆలయ అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా పాల్వంచకు చెందిన దేవు దుర్గ శివప్రసాద్ – రత్నప్రభ దంపతులు రూ.50,199 విరాళాన్ని అందజేశారు.

ఈ విరాళాన్ని ఆలయ కార్యదర్శి అంకం మల్లికార్జునకు దంపతులు అందించారు. ఆలయ పునర్నిర్మాణ పనులకు తమ వంతు సహకారం అందించడం సంతోషంగా ఉందని దాతలు తెలిపారు.

ఈ సందర్భంగా ఆలయ కమిటీ అధ్యక్షులు తాతా ప్రసాద్, కమిటీ సభ్యులు సేపూరి సుధాకర్, బొగా వెంకటేశ్వర్లు దాతలకు కృతజ్ఞతలు తెలిపారు.

ఆలయ పునర్నిర్మాణానికి మరింత సహకారం అవసరమని, భక్తులు, దాతలు ముందుకు వచ్చి తమ వంతు సహాయం అందించాలని ఆలయ కమిటీ సభ్యులు కోరారు.

మణుగూరు నుంచి… వై 7 న్యూస్ తెలుగు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News