శ్రీకాకుళం జిల్లా పలాస | వై 7 న్యూస్ | జూలై 18
పలాస-కాశీబుగ్గ పురపాలక సంఘ కార్యాలయంలో వార్డు రెవెన్యూ కార్యదర్శులు, వార్డు ప్లానింగ్ కార్యదర్శులతో మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసులు సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా కమిషనర్ శ్రీనివాసులు మాట్లాడుతూ.. పురపాలక సంఘ పరిధిలోని ప్రభుత్వ భూములు, రోడ్డు మార్గాలకు సంబంధించిన స్థలాలను ఎవరైనా ఆక్రమిస్తే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ భూముల పరిరక్షణకు రెవెన్యూ, టౌన్ ప్లానింగ్ విభాగాలు సమన్వయంతో ప్రత్యేక ప్రణాళికలు రూపొందించుకోవాలని సూచించారు.
పట్టణ పరిధిలో పెరుగుతున్న అక్రమ లేఔట్లు, అనుమతులు లేకుండా చేపడుతున్న భవన నిర్మాణాలపై ప్రత్యేక దృష్టి సారించాలని కమిషనర్ తెలిపారు. అనుమతులు పొందినప్పటికీ నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు చేపడుతున్న భవనాలను గుర్తించి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
పట్టణ అభివృద్ధి, ప్రణాళికాబద్ధమైన నిర్మాణాల కోసం అధికారులు క్షేత్రస్థాయిలో నిరంతరం పర్యవేక్షణ చేయాలని పేర్కొన్నారు.
ఈ సమావేశంలో టౌన్ సర్వేయర్ శ్రీ రామ గణపతి, బిల్డింగ్ ఇన్స్పెక్టర్లు శ్రీ హర్ష, శ్రీ రమణ, వార్డు రెవెన్యూ కార్యదర్శులు, వార్డు ప్లానింగ్ కార్యదర్శులు, మున్సిపల్ టౌన్ ప్లానింగ్ సిబ్బంది పాల్గొన్నారు.









