శ్రీకాకుళం జిల్లా, పలాస, వై7 న్యూస్, జూన్ 7:
రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించి ట్రాఫిక్ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని కాశీబుగ్గ డీఎస్పీ సూచించారు.శనివారం కోసంగిపురం గ్రామంలో డీఎస్పీ ఆధ్వర్యంలో “సంకల్ప” కార్యక్రమంతో పాటు హెల్మెట్ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలకు హెల్మెట్ ధరించడం వల్ల కలిగే ప్రయోజనాలు, ట్రాఫిక్ నియమాల ప్రాముఖ్యత, రహదారి భద్రతపై అవగాహన కల్పించారు.
రోడ్డు ప్రమాదాలను తగ్గించేందుకు బాధ్యతాయుతమైన డ్రైవింగ్ అలవాట్లు అలవరచుకోవాలని సూచిస్తూ, కార్యక్రమంలో పాల్గొన్న వారితో రహదారి భద్రత సంకల్పం (ప్రతిజ్ఞ) చేయించారు.
ఈ కార్యక్రమానికి గ్రామ ప్రజలు సానుకూలంగా స్పందించి, ట్రాఫిక్ నిబంధనలను పాటించడంతో పాటు హెల్మెట్ ధరించడంలో తమ పూర్తి సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. అధికారులు రహదారి భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు.









