చింతకాని , మే 27 ;
చింతకాని పోలీస్ స్టేషన్ ఎస్సై ఎన్. వీరేందర్ తెలిపిన వివరాల ప్రకారం.. జగన్నాధపురం, పందులపల్లి గ్రామ శివార్లలోని పంట పొలాల్లో రైతులు ఏర్పాటు చేసిన బోరు మోటార్ల వైర్లను గుర్తు తెలియని వ్యక్తులు దొంగిలించిన ఘటనపై రైతుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
దర్యాప్తులో భాగంగా ఈ రోజు నామవరం ఎక్స్ రోడ్ వద్ద అనుమానాస్పదంగా సంచరిస్తున్న శీలం నాగరాజు (తండ్రి వెంకన్న), నివాసం జగన్నాధపురం గ్రామం అనే వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించారు. విచారణలో మద్యం సేవించడం, జల్సాలకు అలవాటు పడి తానే ఈ దొంగతనాలకు పాల్పడినట్లు నిందితుడు ఒప్పుకున్నాడు.
నిందితుడి వద్ద నుంచి దొంగతనం చేసిన వైర్లను కాల్చి పొందిన సుమారు 3.3 కిలోల కాపర్ వైర్‌తో పాటు, కొంత వైరు విక్రయించి వచ్చిన రూ.20 వేల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం నిందితుడిని అరెస్ట్ చేసి ఈ రోజు రిమాండ్‌కు తరలించారు.
ఈ కార్యక్రమంలో ఎస్సై లక్ష్మణ్ చౌదరి మరియు పోలీస్ స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు.








