పలాస మండలం | 26-05-2026
కాశీబుగ్గ పోలీస్ స్టేషన్ ఎస్‌ఐ ఆర్. నరసింహమూర్తి సిబ్బందితో కలిసి మంగళవారం పలాస మండలంలోని కోసంగిపురం గ్రామాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా గ్రామస్తులతో సమావేశం నిర్వహించి నారీ శక్తి, కొత్త చట్టాలు మరియు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ప్రజలకు అవగాహన కల్పించారు.
గ్రామంలోని దేవాలయాలు, మసీదులు, చర్చిల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని సూచించారు. అలాగే గ్రామంలో పండుగలు, ఉత్సవాలు నిర్వహించే సమయంలో పోలీస్ స్టేషన్‌కు ముందస్తు సమాచారం ఇవ్వాలని తెలిపారు.
సైబర్ నేరాలు, ఆన్‌లైన్ మోసాలు, బెట్టింగ్, పేకాట, గంజాయి, నాటు సారా అక్రమ రవాణా మరియు అమ్మకాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. బాల్య వివాహాలు, మహిళలపై జరిగే నేరాలు, అత్యవసర పరిస్థితుల్లో 112 సేవల వినియోగంపై కూడా వివరించారు.
Post Views: 6








