E-PAPER

పలాసలో ఉద్యాన పంటల అవగాహన సదస్సు

శ్రీకాకుళం జిల్లా పలాస మున్సిపాలిటీ పరిధిలోని కేవీఆర్ కన్వెన్షన్‌లో ఉద్యానవనం శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉద్యాన పంటల అవగాహన సదస్సు శనివారం జరిగింది. ఈ కార్యక్రమానికి ఏపీటీపీసీ చైర్మన్ వజ్జ బాబూరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు సంప్రదాయ పంటలతో పాటు ఉద్యాన పంటలపై దృష్టి సారిస్తే అధిక లాభాలు పొందవచ్చని తెలిపారు. ప్రభుత్వం అందిస్తున్న పథకాలు, సబ్సిడీలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ పీరుకట్ల విఠల్, ఏఎంసీ చైర్మన్ మల్లా శ్రీనివాసరావు, కళింగ వైశ్య కార్పొరేషన్ డైరెక్టర్ టంకాల రవిశంకర్ గుప్త, జీడి వర్తకులు, రైతులు, రైతు సంఘాల నాయకులు మరియు అధికారులు పాల్గొన్నారు. కార్యక్రమం విజయవంతంగా నిర్వహించబడింది.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News