E-PAPER

శరీరం కాదు… సంకల్పమే గెలిచింది ; వంశీ 972 మార్కులు

పలాస:
విధి ఎన్నో అడ్డంకులు సృష్టించినా… తన పట్టుదలతో వాటిని జయించిన ఓ విద్యార్థి ప్రతిభ అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. పలాసకు చెందిన సకల భక్తుల వంశీ, పుట్టుకతోనే చేతులు, కళ్ల సహకారం పూర్తిగా లేకపోయినా, తన సంకల్పబలంతో ఇంటర్మీడియట్‌లో 1000 మార్కులకు గాను 972 మార్కులు సాధించి ప్రతిభ చాటుకున్నారు.వంశీ తండ్రి లక్ష్మణరావు చిన్న వ్యాపారి కాగా, తల్లి పార్వతి గృహిణి. తమ కుమారుడిని స్థానికంగా ఓ ప్రైవేట్ కళాశాలలో ఎంపీసీ గ్రూపులో చదివిస్తూ, ఎప్పటికప్పుడు ప్రోత్సాహం అందించారు. కుటుంబ సభ్యులు, ఉపాధ్యాయులు, స్నేహితుల సహకారంతోనే ఈ విజయాన్ని సాధించగలిగానని వంశీ భావోద్వేగంగా తెలిపారు.శారీరక పరిమితులు ఉన్నప్పటికీ… మానసిక దృఢత్వం ఉంటే ఏదైనా సాధ్యమేనని వంశీ మరోసారి నిరూపించారు. ప్రస్తుతం ఆయన సాధించిన ఈ విజయం పలాస ప్రాంతానికి గర్వకారణంగా మారింది.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News