E-PAPER

రాధిక కాన్సెప్ట్ స్కూల్‌పై తప్పుడు వార్తలు ; ప్రిన్సిపాల్ నరేష్ ఖండన

మణుగూరు;

మణుగూరు రాజీవ్ గాంధీ నగర్‌లో ఉన్న రాధిక స్కూల్‌పై ఇటీవల కొన్ని వార్తా మాధ్యమాల్లో ప్రచురితమైన ఆరోపణలు పూర్తిగా అసత్యమని ప్రిన్సిపాల్ నరేష్ స్పష్టం చేశారు. పాఠశాలకు అవసరమైన అన్ని అనుమతులు సంబంధిత శాఖల నుండి తీసుకున్నామని తెలిపారు.ప్రభుత్వ నియమ నిబంధనలను పాటిస్తూ పాఠశాలను నిర్వహిస్తున్నామని, కొందరు వ్యక్తులు వ్యక్తిగత ప్రయోజనాల కోసం తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. తల్లిదండ్రులు, విద్యార్థులు తమపై నమ్మకంతోనే పాఠశాలను ఆదరిస్తున్నారని పేర్కొన్నారు.విద్యతో పాటు క్రీడలు, ఆధునిక సదుపాయాలు అందిస్తున్నామని తెలిపారు. తప్పుడు వార్తలను ప్రచారం చేసిన వారిపై అధికారులు విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కోరారు.ఎవరైనా అనుమానాలు ఉంటే పాఠశాలకు వచ్చి పత్రాలు పరిశీలించవచ్చని, అన్ని వివరాలు చూపేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రిన్సిపాల్ నరేష్ తెలిపారు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News