పలాస ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో గురువారం అకడమిక్ ఆడిట్ నిర్వహించారు. ఈ సందర్భంగా నరసన్నపేట, రాజాం కాలేజీలకు చెందిన ఆంగ్ల అధ్యాపకులు ఎం. శాంతి, వేణుగోపాలరావు ఆడిట్లో పాల్గొన్నారు.కళాశాల రికార్డులు, విద్యా ప్రమాణాలు, అకాడమిక్ పనితీరును వారు సమగ్రంగా పరిశీలించారు. పరిశీలన అనంతరం అన్ని నివేదికలు సక్రమంగా ఉన్నాయని ప్రశంసించారు.
ఈ సందర్భంగా కళాశాలకు ‘A’ గ్రేడ్ గుర్తింపు లభించిందని ప్రిన్సిపాల్ డాక్టర్ జి. వెంకటలక్ష్మి తెలిపారు.
Post Views: 7








