వై 7 న్యూస్ పలాస
పలాస నియోజకవర్గ ప్రజలకు ఏవైనా సమస్యలు ఉంటే నేరుగా తనను సంప్రదించాలని పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష పిలుపునిచ్చారు. సమస్యలను తెలియజేస్తే వెంటనే స్పందించి పరిష్కారం కోసం చర్యలు తీసుకుంటానని ఆమె తెలిపారు.
శుక్రవారం పలాసలోని టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్ డే కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల వినతి పత్రాలను స్వీకరించారు.అదేవిధంగా, అక్కడికక్కడే సంబంధిత అధికారులతో ఫోన్‌లో మాట్లాడి కొన్ని సమస్యలను పరిష్కరించే దిశగా చర్యలు తీసుకున్నారు.ప్రజల సమస్యల పరిష్కారానికి తాను ఎప్పుడూ అందుబాటులో ఉంటానని ఎమ్మెల్యే గౌతు శిరీష స్పష్టం చేశారు.
Post Views: 9








