తూప్రాన్ ఫిబ్రవరి 06
రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 11న మున్సిపల్ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో మెదక్ జిల్లా తూప్రాన్ మున్సిపల్ కేంద్రంలో డీఎస్పీ నరెందర్ గౌడ్ అధ్వర్యంలో తూప్రాన్,నర్సాపూర్,రామాయంపేట సీఐలు మరియు తూప్రాన్ సర్కిల్ కు సంబంధించిన ఎస్సైలతో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు.ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ… తూప్రాన్ మున్సిపల్ ప్రజలు ఎలాంటి ఆందోళన చెందకుండా ఎన్నికల రోజు స్వేచ్ఛాయుత వాతావరణంలో న్యాయం గా ఓటు హక్కును వినియోగించుకోవాలని అవగాహన కల్పించారు.ఎన్నికలు జరిగే రోజు 24 గంటలు భద్రత కల్పిస్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో తూప్రాన్ డీఎస్సీ నరేందర్ గౌడ్ తోపాటు సీఐలు మరియు తూప్రాన్ సర్కిల్ ఎస్సైలు పాల్గొన్నారు.
Post Views: 397









