వై 7 న్యూస్ | పలాస
పలాస టీడీపీ కార్యాలయంలో గురువారం ఉద్దన జీడి రైతు సంఘ నాయకులు పలాస శాసనసభ్యులు గౌతు శిరీష ని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా జీడి రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను ఆమె దృష్టికి తీసుకువచ్చారు.
ముఖ్యంగా జీడి పంటకు గిట్టుబాటు ధరను ప్రభుత్వం తక్షణమే ప్రకటించాలని, అలాగే పలాస ప్రాంతంలో జీడి పంటకు ప్రత్యేక బోర్డు ఏర్పాటు చేయాలని నాయకులు కోరారు. రైతుల సమస్యలను శ్రద్ధగా విన్న ఎమ్మెల్యే గౌతు శిరీష , ఈ అంశంపై సానుకూలంగా స్పందిస్తూ సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని రైతులకు హామీ ఇచ్చారు.
Post Views: 17









