E-PAPER

వాజపేయి సేవలు అనుసరణీయం

పలాస–కాశీబుగ్గ
భారతదేశ మాజీ ప్రధాని అటల్ బీహారి వాజపేయి దేశానికి అందించిన సేవలు అనుసరణీయమని బీజేపీ నాయకులు పేర్కొన్నారు. పలాస–కాశీబుగ్గలోని బీజేపీ కార్యాలయంలో గురువారం వాజపేయి శతజయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా జిల్లా బీజేపీ సీనియర్ నాయకుడు కొర్రయి బాలకృష్ణ యాదవ్ మాట్లాడుతూ, వాజపేయి జీవితం, ఆయన పాటించిన విలువలు నేటి తరానికి ఆదర్శంగా నిలవాలని అన్నారు. ప్రజాసేవే లక్ష్యంగా రాజకీయ జీవితాన్ని కొనసాగించిన నాయకుడిగా వాజపేయి చిరస్థాయిగా గుర్తుండిపోతారని తెలిపారు.
అనంతరం కాశీబుగ్గ బస్‌స్టాండ్ సమీపంలో ఉన్న వాజపేయి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ కార్యక్రమంలో రామానంద స్వామి, మెహనరాజ్ వైశ్య, రాజ్ తదితర బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News