నాయకన్‌గూడెం |ఖమ్మం జిల్లా
నాయకన్‌గూడెం గ్రామంలో పోలింగ్ ప్రక్రియ శాంతియుతంగా ప్రారంభమైంది. పోలింగ్ కేంద్రం ముందు వోటర్లకు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా గ్రామాభివృద్ధి, ప్రజాసంక్షేమమే లక్ష్యంగా పనిచేసే కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వాలని కోరారు.
కాంగ్రెస్ సర్పంచ్ మరియు వార్డు మెంబర్ అభ్యర్థులకు ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని వోటర్లను విజ్ఞప్తి చేశారు. ప్రజాస్వామ్య పండుగలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని, తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని నాయకులు పిలుపునిచ్చారు.
పోలింగ్ కేంద్రం వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అధికారులు తగిన భద్రతా ఏర్పాట్లు చేశారు. గ్రామ ప్రజలు ఉత్సాహంగా పోలింగ్‌లో పాల్గొంటున్నారు.
Post Views: 44









