పలాస , వై 7 న్యూస్ తెలుగు
పలాస జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో శనివారం నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్‌లో మొత్తం 620 కేసులను రాజీ ద్వారా పరిష్కరించినట్లు జూనియర్ సివిల్ జడ్జి, మండల న్యాయ సేవల సంఘం అధ్యక్షులు యూ. మాధురి తెలిపారు.
లోక్ అదాలత్‌కు ముందుగానే ప్రీ–లోక్ అదాలత్ నిర్వహించి, రాజీ పడిన కేసుల్లో పక్షాలను ఒప్పందానికి తీసుకువచ్చి, అనంతరం లోక్ అదాలత్‌లో అవార్డులను జారీ చేసినట్లు ఆమె వివరించారు. అదేవిధంగా అపరాధ రుసుము కేసుల్లో జరిమానాలు విధించి కేసులను పరిష్కరించినట్లు తెలిపారు.
ఈ లోక్ అదాలత్‌లో సివిల్, క్రిమినల్ కేసులతో పాటు భార్య–భర్తల మధ్య వివాదాలకు సంబంధించిన కేసులు కలిపి మొత్తం 620 కేసులు పరిష్కారం అయ్యాయని జడ్జి యూ. మాధురి పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో ఏపీపీ రమేష్, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు పయ్యాజ్ అహ్మద్, ఉపాధ్యక్షులు బి.కె.ఆర్. పట్నాయక్, అనీల్ రాజ్, కాశీబుగ్గ సీఐ వై. రామకృష్ణతో పాటు న్యాయవాదులు, కోర్టు సిబ్బంది పాల్గొన్నారు.
రిపోర్టర్ ;దినేష్









