బూర్గంపాడు | భద్రాద్రి కొత్తగూడెం జిల్లా
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం సారపాక గ్రామంలో కాంగ్రెస్ పార్టీ తరఫున గెలుపొందిన సర్పంచ్ అభ్యర్థులు మీడియా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా సారపాక నూతన సర్పంచ్ గుగులోత్ కిషోర్ శివరాం నాయక్ మాట్లాడుతూ, గ్రామంలో మౌలిక వసతుల కల్పనకు ప్రణాళికబద్ధంగా ముందుకు సాగుతామని తెలిపారు. ప్రతి వారం ఒక వార్డులో పర్యటించి అక్కడి సమస్యలను గుర్తించి పరిష్కరించే దిశగా పనిచేస్తామని హామీ ఇచ్చారు.
సర్పంచ్ ఎన్నికల్లో తనపై నమ్మకం ఉంచి గెలిపించిన గ్రామ ప్రజలందరికీ ఆయన హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.
రిపోర్టర్: మేకల జ్యోతి
Post Views: 48









