E-PAPER

అర్ధరాత్రి చిన్నారి ప్రాణం కోసం ముందుకు వచ్చిన ప్రభుత్వ ఉద్యోగి

O-ve రక్తం దానం చేసి మూడు రోజుల పాపకు ప్రాణం పోసిన జూపల్లి వెంకట రంగారావు

వరంగల్ జిల్లా రంగంపేటలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో లైబ్రేరియన్‌గా విధులు నిర్వహిస్తున్న ప్రభుత్వ ఉద్యోగి జూపల్లి వెంకట రంగారావు గారు అర్ధరాత్రి సమయంలో ఒక మూడు రోజుల పసిబిడ్డ కోసం అత్యంత అరుదైన O-negative రక్తం దానం చేసి మానవత్వానికి ఉదాహరణగా నిలిచారు.

మంగపేట మండలం రాజుపేట గ్రామానికి చెందిన పగిళ్ల సౌజన్య–సురేష్ దంపతుల పసిపాపకు అత్యవసరంగా రక్తం అవసరం ఏర్పడటంతో ఒక మిత్రుడు సోషల్ మీడియాలో సందేశం పోస్ట్ చేశారు. వెంటనే యువ నేతాజీ ఫౌండేషన్ సభ్యుడు గజ్జెల సుమన్ స్పందించి ఫౌండేషన్ వాట్సాప్ గ్రూపుల్లో సమాచారం పంపారు. ఆ సందేశాన్ని చూసిన ఫౌండేషన్ ప్రధాన సభ్యుడు, ప్రభుత్వ పాలిటెక్నిక్ ఉద్యోగి మునిగాల రాము తన వాట్సాప్ స్టేటస్‌లో పోస్ట్ చేయగా, వెంటనే స్పందించిన వెంకట రంగారావు గారు రాత్రి 12 గంటలకు కూడా వెనుకాడకుండా బ్లడ్ బ్యాంక్‌కు వెళ్లి రక్తదానం చేశారు.

“18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ రక్తదానాన్ని తమ కర్తవ్యంగా భావించాలి. ఒకటి రెండు నిమిషాల రక్తదానం ఒక ప్రాణాన్ని నిలబెడుతుంది” అని వెంకట రంగారావు గారు సందేశం ఇచ్చారు.

చిన్నారి తల్లిదండ్రులు రక్తదానం చేసిన రంగారావు గారికి, సమాచారం పంచిన రాము గారికి, సుమన్ గారికి కృతజ్ఞతలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో యువ నేతాజీ ఫౌండేషన్ వరంగల్ అధ్యక్షులు కొత్తకొండ అరుణ్ కుమార్, వరంగల్ పోలీస్ కానిస్టేబుల్ కన్నె రాజు (స్విమ్మర్ రాజు), కానిస్టేబుల్ బొట్టు కమలాకర్, కోలా రాజేష్, ప్రభుత్వ ఉపాధ్యాయుడు గజ్జెల సుమన్, అలువల పృథ్వి, ఉప్పరపల్లి రాజ్ కుమార్, పాలకుర్తి విష్ణు, ఎస్.కె. ముస్తఫా, పులి కిరణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News