వై 7 న్యూస్ పలాస
మందస మండలం సాబకోట పంచాయతీ బిత్తర బంధ గ్రామంలో గురువారం విషాదకర ఘటన చోటుచేసుకుంది. ఇంటి పక్కనే ఉన్న విషపూరిత ఉమ్మెత్త కాయలు తిని ఇద్దరు చిన్నారులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.సవర విక్రమ్, గంగ దంపతులు ఇంటి పనిలో ఉండగా, పిల్లలు బయట ఆటలాడుతూ పొరపాటున ఆ కాయలు తిన్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. పిల్లల్లో అకస్మాత్తుగా వాంతులు, తలనిర్మళం వంటి లక్షణాలు కనిపించడంతో బిగ్గరగా అరిచారు.వెంటనే కుటుంబ సభ్యులు 108 అంబులెన్స్‌కు సమాచారం ఇచ్చారు. స్పందించిన సిబ్బంది ఘటన స్థలానికి చేరుకొని ఇద్దరు చిన్నారులను టెక్కలి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.పిల్లల పరిస్థితి ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో ఉన్నట్లు సమాచారం.
Post Views: 46









