మణుగూరు:
స్నేహం అంటే కష్టకాలంలో తోడుగా ఉండటమే అని నిరూపించారు మణుగూరు ప్రాంతానికి చెందిన యువ స్నేహితులు. ఇటీవల జరిగిన ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన శరం నరేష్ ప్రస్తుతం ఇంటి వద్ద పగిడేరు లో విశ్రాంతి తీసుకుంటుండగా, అతనికి అండగా నిలిచిన స్నేహితులు నరేష్ ను కలిసి ₹9,500 ఆర్థిక సహాయాన్ని అందజేశారు.
ప్రమాదం గురించి తెలిసిన వెంటనే స్నేహితులంతా ఒకచోట చేరారు. మన స్నేహితుడు ఇబ్బంది పడుతున్నాడని తెలిసి బాధపడ్డాం. త్వరగా కోలుకోవడానికి మా వంతు సాయం చేయాలని ఎవరూ చెప్పకుండానే నిర్ణయించుకున్నాం. ఈ చిన్న సహాయం అతనికి ధైర్యాన్ని ఇస్తుందని ఆశిస్తున్నాం,” అని వారు తెలిపారు.
స్నేహితుల మానవత్వాన్ని స్థానికులు అభినందించారు. కష్టకాలంలో చేతులు చాచి నిలబడిన ఈ యువకుల సహాయాన్ని, నిజమైన స్నేహానికి నిదర్శనంగా పలువురు కొనియాడుతున్నారు.
Post Views: 243









