E-PAPER

భూమి కోసం ఏరులై పారిన రక్తం తిర్లాపురంలో ఉద్రిక్తత

మణుగూరు, సెప్టెంబర్ 8 వై 7 న్యూస్:

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలం తిర్లాపురం గ్రామంలో భూమి కోసం ఘర్షణ చోటు చేసుకుంది. సింగరేణి ప్రభావిత ప్రాంతంలో అధికారులు సర్వే నిర్వహిస్తుండగా, “మా భూమి అంటే మాభూమి” అంటూ రెండు వర్గాలు ఒకరిపై ఒకరు విరుచుకుపడ్డాయి.

కర్రలు, ఇతర మారణాయుధాలతో దాడులు జరగడంతో ఇరు వర్గాలకు చెందిన పలువురు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని అధికారులు తక్షణమే అంబులెన్స్‌లలో సమీప ఆసుపత్రులకు తరలించారు.పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు అక్కడికి చేరుకుని ఇరు వర్గాలను చెదరగొట్టి శాంతింపజేశారు.సర్వే చేయడానికి వచ్చిన సింగరేణి అధికారులు, పరిస్థితి తీవ్రరూపం దాల్చడంతో తమ పనిని నిలిపివేసి అక్కడి నుంచి వెళ్లిపోయారు.
ఈ సంఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News