భద్రాచలం, సెప్టెంబర్ 08: వై 7 న్యూస్
చర్ల మండలం మామిడిగూడెం గ్రామంలోని 62, 65/A సర్వే నంబర్లలో గిరిజనులు సాగు చేస్తున్న పోడు భూములను వారికే అప్పగించాలని సిపిఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ డిమాండ్ చేసింది.
ఫారెస్ట్ అధికారులు సమాచారం లేకుండా గ్రామంలోకి ప్రవేశించి ఏడుగురు మహిళలను జీబులో ఎక్కించి బెదిరించి, అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపారని భద్రాచలం డివిజన్ కార్యదర్శి ముసలి సతీష్ ఆరోపించారు.
అక్రమ కేసులు ఎత్తివేసి, జైలులో ఉన్న మహిళలను వెంటనే విడుదల చేయాలని కోరుతూ ఐటీడీఏ ముందు ధర్నా నిర్వహించారు. వారం రోజుల్లో సమస్య పరిష్కారం కాని పక్షంలో పెద్దఎత్తున ఉద్యమాలు కొనసాగిస్తామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో తెల్లం పెంటమ్మ, బొర్రం సరోజిని, తెల్లం రామకృష్ణతో పాటు మరికొందరు గిరిజనులు పాల్గొన్నారు.
Post Views: 137









