అశ్వరావుపేట,ఆగస్టు 09 వై 7 న్యూస్;
అశ్వరావుపేట నియోజకవర్గంలో పలు కార్యక్రమాల్లో అశ్వరావుపేట నియోజకవర్గ బీఆర్‌ఎస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఈ రోజు (09-08-2025) కొమ్ముగూడెం, దమ్మపేట, జెమేధర్ బంజార్, అశ్వరావుపేట నియోజకవర్గ కేంద్రంలో ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా ఆదివాసీ పోరాట యోధులు కొమరం భీమ్, సోయం గంగులు విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించి, ఆదివాసీ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. దమ్మపేట మండల కేంద్రంలోని మహాలక్ష్మి అమ్మవారి ఆలయ కమిటీ సభ్యుల ఆహ్వానం మేరకు రాఖీ పౌర్ణమి సందర్భంగా మహాలక్ష్మి అమ్మవారిని దర్శించుకుని, అన్నదాన కార్యక్రమం నిమిత్తం ఆలయ కమిటీ సభ్యులకు రూ.5116/- అందజేసి, అనంతరం ఆలయ కమిటీ సభ్యులు సోయం వీరభద్రం, వాడే వీరస్వామిని శాలువాతో సత్కరించారు. అశ్వరావుపేట మండలం పాపిడిగూడెం గ్రామంలో చిర్రా నవీన్ కుమార్-అనిత నూతన వధూవరులను, రెడ్డిగూడెం గ్రామంలో రామ్మోహన్ రెడ్డి-సాయి పద్మశ్రీ నూతన వధూవరులను సోయం వీరభద్రం ఆశీర్వదించారు. ఈ కార్యక్రమాల్లో ఆదివాసీ నాయకులు కటం స్వామిదొర, కోర్సా వెంకటేష్ దొర, బండారు సూర్యనారాయణ, గడ్డం వెంకటేష్, తంబల్ల రవి, తాటి చంద్రం, మడకం వెంకటేశ్వర్లు, సోయం రామ్మూర్తి, ముత్యాలరావు, తాటి రామారావు, అశ్వరావుపేట నియోజకవర్గ ఆదివాసీ యువ నాయకులు వాడే విజయ వీరస్వామి రాజబాబు, చేపా జోగారావు, వుకే లక్ష్మయ్య, బుద్దుల కృష్ణ, సోయం సత్యనారాయణ, చేపా రజని, పద్దం విజయలక్ష్మి, నీలారెడ్డి, శేఖర్, సోమవరపు శ్రీనివాసరావు, చక్రపు శ్రీను, సూరిబాబు, సోమేశ్వరావు తదితరులు పాల్గొన్నారు.









