మణుగూరు, జూన్ 16 వై 7 న్యూస్
మణుగూరు ప్రభుత్వ ఆసుపత్రిలో నిత్యాన్నదాన కార్యక్రమాన్ని శ్రీ శివశక్తి మహాపీఠం చారిటబుల్ ట్రస్ట్ ఈరోజు ఘనంగా ప్రారంభించింది. ఈ కార్యక్రమం ఆసుపత్రికి వచ్చిన రోగులు, వారి బంధువులు, మరియు ఆసుపత్రి సిబ్బందికి ఉపయోగపడేలా నిర్వహించబడుతుంది. ఇకపై ప్రతి రోజు అన్నదానం కొనసాగుతుందని ట్రస్టు సభ్యులు తెలిపారు.ఈ కార్యక్రమంలో ట్రస్ట్ అధ్యక్షులు శ్రీశ్రీశ్రీ కాశీ విశ్వనాథ్ గురూజీ, ఉపాధ్యక్షులు మూల చిన్న ఆది రెడ్డి , మరియు ట్రెజరర్ కటుకోజ్వల శ్రీనివాస చారి పాల్గొన్నారు.
Post Views: 353









