మణుగూరు, జూన్ 7 (వై7 న్యూస్):
సింగరేణి ఆసుపత్రుల్లో బిపి, షుగర్, గుండె సంబంధిత మందుల కొరత తీవ్రంగా ఉన్నట్టు AITUC బ్రాంచ్ సెక్రటరీ కామ్రేడ్ వై. రామ్ గోపాల్ తెలిపారు. 60 ఏళ్లు పైబడిన రిటైర్డ్ కార్మికులు దూరం నుండి వచ్చినా, 10–15 రోజులకు సరిపడే మందులే ఇవ్వడం దారుణమన్నారు.
అధికారుల అలసత్వం వల్లే ఈ పరిస్థితి నెలకొందని ఆరోపించారు. యాజమాన్యం తక్షణమే రెండు నెలల మందుల స్టాక్ కల్పించి, అన్ని ఆసుపత్రుల్లో ఖాళీగా ఉన్న డాక్టర్లు, టెక్నికల్ పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు.ఈ అంశాలపై మణుగూరు ఏరియా హాస్పిటల్ డిప్యూటీ సి ఎం వో కు మెమోరాండం సమర్పించారు. కార్యక్రమంలో జి. పుల్లారావు, ఆవుల నాగరాజు, నంబూరి శ్రీనివాసరావు, బంగారి రవికుమార్, బొక్క శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
Post Views: 103









