E-PAPER

దేశంలో 3 రోజుల పాటు ఏటీఎం లు బంద్?.. కేంద్రం కీలక ప్రకటన

దేశంలో మూడు రోజులు పాటు ఏటీఎం లు బంద్

స్టేట్ వై7 న్యూస్

భారత్-పాక్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో ఒక పోస్టు వైరల్‌గా మారింది. దేశవ్యాప్తంగా ఏటీఎం లు 2-3 రోజులు మూసివేయబడతాయని అందులోరాసుంది. ఈ పోస్టుపై పి ఐ బి స్పందించింది. అది ఫేక్ పోస్ట్ అని ట్వీట్ చేసింది. ఏటీఎం లు యథావిధిగా పనిచేస్తాయని ప్రజలకు హామీ ఇచ్చింది.

భారత్ – పాకిస్తాన్ మధ్య యుద్ధ వాతావరణం హీటెక్కింది. భారత్ ఆపరేషన్ సిందూర్ అనంతరం పాకిస్తాన్ దాడికి ప్రయత్నించింది. డ్రోన్లు, క్షిపణులను భారత సరిహద్దు ప్రాంతాలపై ప్రయోగించింది. వాటిని ముందుగానే పసిగట్టిన ఇండియన్ ఆర్మీ చాకచక్యంగా గాల్లోనే ధ్వంసం చేశాయి. అయితే ఇండియా పాక్ వార్ నేపథ్యంలో ఇప్పటికే భారతదేశంలో పలు రైళ్లు, విమానాలు క్యాన్సిల్ అయ్యాయి. మరోవైపు ఎయిర్‌పోర్టులు సైతం మూసివేశారు.

ఏటీఎంలు బంద్?

ఈ నేపథ్యంలో తాజాగా మరో వార్త నెట్టింట వైరల్‌గా మారింది. దేశవ్యాప్తంగా ఏటీఎం లు 2-3 రోజులు మూసివేయబడతాయని జోరుగా ఓ పోస్ట్ చక్కర్లు కొడుతుంది. అందులో ‘‘పాకిస్తాన్ యుద్ధం మధ్య రాన్సమ్‌వేర్ సైబర్ దాడి కారణంగా.. రాబోయే 2-3 రోజులు ఏటీఎం లు మూసివేయబడతాయి. ఎలాంటి ఆన్‌లైన్ ట్రాన్సక్షన్స్ చేయవద్దు. దయచేసి ఫోన్‌లోని అన్ని కాంటాక్ట్ దారులకు ‘‘డాన్స్ ఆఫ్ ది హిల్లరీ’’ అనే వీడియోను ఓపెన్ చేయొద్దని తెలియజేయండి.

పి ఐ బి ట్వీట్

ఇది మీ మొబైల్‌ను ఫార్మాట్ చేసే వైరస్. జాగ్రత్త.. దయచేసి భారీ రాన్సమ్‌వేర్ దాడిని షేర్ చేయండి. అటాచ్‌మింట్‌లతో కూడిన ఏ ఇమెయిల్‌ను తెరవకండి.’’ అంటూ అందులో ఉంది. ఈ పోస్టుపై ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (పి ఐ బి) స్పందించింది. అది ఫేక్ పోస్ట్ అని పేర్కొంది. ఈ మేరకు ఒక ట్వీట్ చేసింది. తప్పుడుగా పేర్కొంటూ వైరల్ అవుతున్న వాట్సాప్ మెసేజ్‌ను ఎవరూ నమ్మకండి అని తెలిపింది. ఏటీఎం లు యథావిధిగా పనిచేస్తాయని ప్రజలకు హామీ ఇచ్చింది.

ఏటీఎం సేవలు అంతరాయం లేకుండా ఉంటాయని పేర్కొంది. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో ప్రసారం అవుతున్న మెసేజ్ పట్ల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని.. ఖచ్చితమైన వార్తల కోసం అధికారిక అకౌంట్స్ చూడాలని పి ఐ బి ప్రజలకు సూచించిం

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :