E-PAPER

రేవంత్ రెడ్డి సర్కార్ విద్యాశాఖ మంత్రి ని నియమించాలి

రాబోయే బడ్జెట్లో విద్యారంగానికి 30% నిధులు కేటాయించాలి

పెండింగ్ రియంబర్స్ మెంట్, స్కాలర్ షిప్ లు విడుదల చేయాలి

పాఠశాల విద్యలో ఐదు ఎనిమిది తరగతులకు డిటెన్షన్ విధానం రద్దు చేయాలి

విశ్వవిద్యాలయ ల స్వయంప్రతిపత్తిని కాపాడాలి

అమెరికాలో భారత్ పౌరులపై ట్రంప్ దుశ్చర్యలను ఖండించండి

విద్యారంగంపై సోయిలేని రేవంత్ రెడ్డి సర్కార్

మునిగేలా శివ ప్రశాంత్ భద్రాచలం డివిజన్ కార్యదర్శి

భద్రాచలం, ఫిబ్రవరి 12 వై సెవెన్ న్యూస్

ఈరోజు PDSU రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా భద్రాచలం పట్టణంలో మదర్ తెరిసా డిగ్రీ కళాశాలలో ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా PDSU భద్రాచలం డివిజన్ కార్యదర్శి మునిగేలా శివ ప్రశాంత్ మాట్లాడుతూ. తెలంగాణ రాష్ట్రంలో విద్య హక్కు చట్టం నిర్దేశించిన ప్రమాణాలను 40597 ప్రభుత్వ పాఠశాలలో కేవలం ఆరు శాతం మాత్రమే కలిగి ఉన్నాయని నేషనల్ ఛాంపియన్ సర్వే తెలిపింది ప్రభుత్వ పాఠశాలలో సరైన సౌకర్యాలు లేకపోవడం వల్ల ప్రభుత్వ పాఠశాలలపై తల్లిదండ్రులకు నమ్మకం లేకుండా పోతుందని ఆయన అన్నారు. ఇటీవల కాలంలో ప్రభుత్వ విద్య సంస్థలలో వరుస ఘటన జరిగిన పాలకులు మొద్దు నిద్ర వీడడం లేదు. రాష్ట్రంలో అత్యున్నత న్యాయస్థానం ప్రభుత్వాన్ని మందలించే స్థితికి విద్యా వ్యవస్థ చేరింది. సాక్షాత్తు ముఖ్యమంత్రి విద్యార్థులకు పోష్టికాహారం అందించడంలో రాజీ పడిన ప్రసక్తి లేదని, బాధితులపై చర్యలు తీసుకుంటానని ప్రకటించారని ఆయన అన్నారు. ప్రభుత్వ హాస్టల్లో ఫుడ్ పాయిజన్ లో ఈ ఏడాది 40 సార్లు ఫుడ్ పాయిజన్ జరిగి 1040 మంది విద్యార్థుల ఆసుపత్రిలో చేరారు అని ఆయన అన్నారు. ఇప్పటివరకు మిస్ చార్జీలు కాస్మో చార్జెస్ విడుదల చేయక అనేక ఇబ్బందులు పడుతున్న పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సర్కార్ ఇప్పటివరకు విద్యాశాఖ మంత్రిని నియమించుకోకపోవడం చాలా దారుణమని ఆయన అన్నారు. పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్లు విడుదల చేయక విద్యార్థులు అనేక ఇబ్బందులు పడుతున్నారని ప్రవేటు విద్యాసంస్థలు విద్యార్థులకు సర్టిఫికెట్లు ఇవ్వక పై చదువులకు అనేక ఇబ్బందులు పడుతున్న రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోకుండా వ్యవహరిస్తుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం పెండింగ్లో ఉన్న 7500 కోట్లుకు పైగా పెండింగ్లో స్కాలర్షిప్లను విడుదల చేయాలని ఆయన అన్నారు. వచ్చే అసెంబ్లీ సమావేశాలలో విద్యారంగానికి 30 శాతం నిధులు కేటాయించి విద్యారంగ సమస్యలు పరిష్కారం చేయాలని ఆయన అన్నారు. విద్యారంగంపై కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్న విద్య రంగాన్ని బలోపేతం చేయాలని విద్య రంగానికి సరైన నిధులు కేటాయించాలని ఆయన డిమాండ్ చేశారు. రాష్ట్రంలో విశ్వవిద్యాలయాలలో ఖాళీగా ఉన్న ప్రొఫెసర్, టీచింగ్, నాను టీచింగ్ పోస్టులు భర్తీ చేయడం వదిలేసారు . విశ్వవిద్యాలయాల్లో కనీస సౌకర్యాలు లేకుండా నిర్లక్ష్యం చేస్తున్నారు కాపాడే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు . అమెరికాలో భారత పౌరులపై ట్రంపు చేసే దుశ్చర్యను దేశ ప్రజలంతా ఖండించాలని ప్రధానమంత్రి మోడీ స్పందించి భారత పౌరులకి రక్షణ కల్పించాలని ఆయన అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇకనైనా విద్యాశాఖ మంత్రిని నియమించి పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్ ని విడుదల చేయకుండా కాలయాపన చేస్తే రాష్ట్రంలో మరో విద్యార్థి ఉద్యమం చేపడుతామని రాష్ట్ర ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డి సర్కార్ నీ ఆయన హెచ్చరించారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్