E-PAPER

ప్రజా సమస్యల పరిష్కారంకై ఫిబ్రవరి 20న చలో హైదరాబాద్

న్యూ డెమోక్రసీ పార్టీ భద్రాచలం డివిజన్ కార్యదర్శి ముసలి సతీష్

చర్ల,ఫిబ్రవరి 01 వై సెవెన్ న్యూస్
కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారెంటీ ల అమలుకై ప్రజా సమస్యల పరిష్కారం కై సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపులో భాగంగా ఫిబ్రవరి 20న చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరుతూ చర్లలో ప్రచారం నిర్వహించిన సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ భద్రాచలం డివిజన్ కార్యదర్శి కామ్రేడ్ ముసలి సతీష్.వారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 14 నెలలు కావస్తున్న ఇంతవరకు ఒక సమస్యను కూడా పరిష్కారం చేయలేదని వారన్నారు.ఇందిరమ్మ ఇండ్లు అనర్హులకు ఇచ్చారని అర్హులైన వారికి నిజమైన పేదవారికి ఇవ్వలేదని వారన్నారు. పోడు భూములకు పట్టాలిస్తామని పట్టాలు ఇవ్వకపోగా ఫారెస్ట్ వారు దాడులు పెరిగాయని, సాగు చేసుకుంటున్న పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని వారు తెలియజేశారు. కౌలు రైతులకు రైతు భరోసా ఇవ్వాలని లక్ష ఉద్యోగాల హామీని భర్తీ చేయాలని విద్యార్థులకు రియంబర్స్మెంట్ ఇవ్వాలని, ఆరోగ్యశ్రీ నిధులు విడుదల చేయాలని కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ కార్మికులను పర్మినెంట్ చేయాలని ఏజెన్సీలో పీసా యాక్ట్ ,1/70 చట్టాలను పకడ్బందీగా అమలు చేయాలని వారన్నారు. గత టిఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయలేదని ఆ ప్రభుత్వాన్ని గద్దె దింపి 420 హామీలు ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దెనెక్కిస్తే గద్దెనెక్కినాక బుద్ధి మార్చుకొని ప్రజా సమస్యల్ని పట్టించుకోవడంలేదని వారి సందర్భంగా ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమస్యల పరిష్కారం కై ఆరు గ్యారెంటీల అమలుకై ప్రజలంతా ఐక్యంగా చలో హైదరాబాద్ కార్యక్రమానికి తరలిరావాలని వారు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బీమా, సమ్మక్క ,నందు తదితరులు పాల్గొన్నారు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News