E-PAPER

మణుగూరు యూత్ ఆధ్వర్యంలో స్కూల్ క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభం

క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభించిన చందా సంతోష్

మణుగూరు, జనవరి 29 వై సెవెన్ న్యూస్

మణుగూరు పట్టణంలో భద్రాద్రి స్టేడియం లో మణుగూరు యూత్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న స్కూల్ స్థాయి క్రికెట్ టోర్నమెంట్ కార్యక్రమానికి బుధవారం ముఖ్యఅతిథిగా పినపాక టిపిసిసి సభ్యులు చందా సంతోష్ వారితో పాటు ఎక్స్లెంట్ స్కూల్ కి సంబంధించి యూసుఫ్ సర్,ఖాన్ సార్లు ప్రారంభించారు. ఈ సందర్భంగా చందా సంతోష్ కుమార్ యువకుల తొ క్రికెట్ ఆడి వారిని ఉత్సాహపరిచారు.వారు మాట్లాడుతూ… క్రీడల వల్ల స్నేహ సంబంధాలు పెరుగుతాయని ఆరోగ్యంగా ఉంటారని పేర్కొన్నారు. క్రీడల్లో గెలుపోటములు సహజమని ఓడిపోయిన వారు నిరుత్సాహపడకుండా మళ్లీ గెలిచేందుకు కృషి చేయాలి అన్నారు. మొదటిరోజు ఏడుల్ల బయ్యారం సెయింట్ మ్యారీ స్కూల్ మరియు ఎక్స్లెంట్ స్కూల్ కు మధ్య హోరాహోరీ పోటీ జరిగింది.. ఈ కార్యక్రమంలో మణుగూరు యూత్ సభ్యులు ముజ్జు , అమూల్ శ్రీను, ఆర్.ఎం.పి మధు,సాయి పాల్గొన్నారు..

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్