నల్గొండ జిల్లా,జనవరి02 వై7 న్యూస్ తెలుగు
అర్ధరాత్రి గిరిజన వృద్ధ మహిళపై దాడి చేసి 8 తులాల బంగారం అపహరించి న సంఘటన నల్గొండ జిల్లా చింతపల్లి మండలంలో బుధవారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం మండల పరిధిలోని రాజ్య నాయక్ తండాకు చెందిన వడ్త్యా ముత్యాలి 70 సంవత్సరాల వయసుగల ఆమె ఇంట్లో ఒంటరిగా నిద్రిస్తుంది.రాత్రి సమయంలో2 గంటల సమయంలో గుర్తుతెలియని వ్యక్తులు ఆమెపై దాడి చేసి మెడలో, బీరువాలో ఉన్న 8 తులాల బంగారం, ఇతర వస్తువులు 20 తులాల వెండి, ఒక 1,50,000 ల నగదు గుర్తు తెలియని వ్యక్తులు అపహరించుకు వెళ్లారు. బాధితురాలు కుమారుడు వడ్ద్య భాషా ఇచ్చిన ఫిర్యాదు మేరకు చింతపల్లి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ బి.యాదయ్య పేర్కొన్నారు.
Post Views: 43