E-PAPER

రక్షణతోనే అధికోత్పత్తి సాధ్యం … పనిలో అనుక్షణం అప్రమత్తతే ప్రమాదాలను నివారిస్తుంది

రక్షణ తనిఖీ బృందం కన్వీనర్ డి బైద్య, జిఎం (ఎక్స్ ఫ్లోసివ్స్)

మణుగూరు డిసెంబర్ 10 వై సెవెన్ న్యూస్;

సింగరేణి 55వ రక్షణ వక్షోత్సవాల సందర్భంగా మణుగూరు ఏరియా పీకేఓసీని సందర్శించిన రక్షణ తనిఖీ బృందం. పూర్తిస్థాయి రక్షణతోనే అది కోత్పత్తి సాధ్యం అవుతుందని ఆ దిశగా పీకే ఓసి ఉద్యోగులు రక్షణతో కూడిన ఉత్పత్తికి పాటుపడాలని డి బైద్య జిఎం ఎక్స్ ప్లోజివ్స్ అన్నారు.

సింగరేణి 55వ వార్షిక రక్షణ పక్షోత్సవాల సందర్భంగా మంగళవారం నాడు పీకే ఓ సి నూతన క్షేత్ర కార్యాలయం ప్రాంగణంలో ఏరియా ఇన్ ఛార్జ్ జిఎం పీకే ఓసి ప్రాజెక్ట్ అధికారి శ్రీ తాళ్లపల్లి లక్ష్మీపతి గౌడ్ గారి అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆయన కార్మికులనుద్దేశించి మాట్లాడారు. ఎవరి రక్షణకు వారే బాధ్యులని మనం పూర్తిస్థాయిలో రక్షణ సూత్రాలు పాటిస్తున్నామని నమ్మకం ఉంటే ఇంట్లో ఇల్లాలు నుండి గనిలో పనిలో సూపర్వైజర్లు అధికారుల వరకు మనపై పూర్తిస్థాయి నమ్మకం ఉంటుందని అన్నారు. రక్షణ పాటించని చోట ఉత్పత్తులు రావచ్చునేమో కానీ అత్యధిక ఉత్పత్తులు రావని ఏ సంస్థ ప్రగతికైనా రక్షణతో కూడిన నిర్దేశిత ఉత్పత్తి లక్ష్యాలు సాధన ముఖ్యమని అన్నారు. ఆ దిశగా పీకే ఓసి ఉద్యోగులు పీకే ఓ సీని లాభాల బాటలో నడిపిస్తూ ఇతర ఏరియాలకు స్ఫూర్తిదాయకంగా నిలవడం అభినందనీయమని ఆయన కార్మికుల హర్షద్వానాల మధ్య ప్రకటించారు.

ఇంచార్జ్ జిఎం పీకే ఓసీ ప్రాజెక్ట్ అధికారి తాళ్లపల్లి లక్ష్మీపతి గౌడ్ మాట్లాడుతూ సింగరేణి రెస్క్యూ టీం కు జాతీయ అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తేవడంలో సింగరేణి రక్షణలో పలు సంస్కరణలు చేపట్టంలో జి ఎం వైద్య సేవలు ప్రశంసనీయమని కొనియాడారు. రక్షణ బృందం కన్వీనర్ గా పికే ఓసిని సందర్శించడం ఆనందంగా ఉందన్నారు. పీకే ఓసి ఉద్యోగుల పని సంస్కృతినీ, సమిష్టి కృషితో సాధించిన బహుమతులను, సమీప గ్రామాలలో నిరుపేద విద్యార్థులకు వృద్ధులకు నిరుపేద గిరిజనులకు ఉద్యోగులు చేస్తున్న సామాజిక సేవలను తనిఖీ బృందానికి పిఓ వివరించారు. గత సంవత్సరం పీకే ఓసి సాధించిన బహుమతులను రక్షణ తనిఖీ బృందం అధికారుల చేతుల మీదుగా పీకే ఓసీ అధికారులు కార్మిక సంఘాల నాయకులు అందుకున్నారు. మందు గుండు సామాగ్రి తరలింపు, ప్యాకింగ్, బ్లాస్టింగ్, తదితర అంశాలలో బ్లాస్టింగ్ విభాగపు కార్మికులు చేపట్టవలసిన జాగ్రత్తలపై సింగరేణి మాజీ ఉద్యోగి ఎస్.డి నాసర్ పాషా రచన దర్శకత్వంలో రాజ్ కుమార్, పవన్ కుమార్, ఆదినారాయణ ప్రధాన పాత్రలలో బృందం ప్రదర్శించిన రక్షణ సందేశాత్మక “తస్మాత్ జాగ్రత్త” నాటిక రక్షణ తనిఖీ బృందం సభ్యులను, అధికారులను, కార్మికులను ఎంతగానో ఆలోచింపజేసింది. ఎన్ సి హెచ్ పవన్, కే శ్రీనివాస్, డేవిడ్ రాజు ప్రవీణ్, ఆర్కెస్ట్రా బృందం
ఆలపించిన స్వాగత గీతం, రక్షణ సందేశాత్మక పాటలు సబికులను ఎంతగానో అదరించాయి. ప్రదర్శన అనంతరం అధికారుల చేతుల మీదుగా కళాకారులకు జ్ఞాపికలను అందజేశారు. అదేవిధంగా గనిలో వృత్తి నైపుణ్యత కనబరిచిన పలువురు కార్మికులకు కూడా అతిధుల చేతుల మీదుగా జ్ఞాపికలను అందజేశారు.సభ అనంతరం రక్షణ తనిఖీ బృందం ఆధ్వర్యంలో పని ప్రదేశాలు, వర్క్ షాప్ లు, హాల్ రోడ్స్, డంప్ యార్డ్ లు, ఆఫ్ లోడింగ్, బ్లాస్టింగ్, లైటింగ్, పంపు సెక్షన్, పవర్ సెక్షన్, రెస్క్యూ టీం ప్రదర్శన, స్టాండర్డ్ ఆపరేషన్ ప్రొసీజర్ మరియు సెఫ్టీ మేనేజ్మెంట్ ప్లాన్ అమలు తదితర అంశాలపై తనిఖీ బృందం నిశితంగా పరిశీలించారు. ఈ అంశాలపై కార్మికులకు ఉన్న అవగాహన కూడా అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో భాగంగా రక్షణ తనిఖీ బృందానికి పీకే ఓసి ఉద్యోగులు బ్యాండ్ మేళం తో ఘనంగా స్వాగతం పలికారు. ముందుగా కనకదుర్గమ్మ అమ్మవారి ఆలయాన్ని సందర్శించి అమ్మవారి ఆశీస్సులు అందుకున్నారు. కార్యక్రమంలో చివరిగా సామూహిక రక్షణ ప్రతిజ్ఞ చేశారు.

ఈ కార్యక్రమంలో రక్షణ తనిఖీ బృందం సభ్యులు షేక్ మిన్హా జుద్దీన్, వీరన్న, ఎల్ దయాకర్, డాక్టర్ సురేష్, ఎం ప్రసాద్, ఎం మురళీకృష్ణ, శ్యాం ప్రసాద్, యుగేందర్ మరియు ఏరియా అధికారులు ఏరియా ఇంజనీర్ ఆర్ శ్రీనివాస్, ఏరియా సిఫ్టీ ఆఫీసర్ వెంకట రామారావు, పీకే ఓ సి ప్రాజెక్ట్ మేనేజర్ దండమూడి రాంబాబు, ప్రాజెక్ట్ ఇంజనీర్ జే వీరభద్రుడు, మేనేజర్ లు కె సురేష్ కుమార్, రమణారెడ్డి, పీకే ఓసి రక్షణ అధికారి ఎం లింగబాబు, కళ్యాణ్ రామ్, ఎం నరసింహారావు, గుర్తింపు సంఘం నాయకులు వై రామ్ గోపాల్, ప్రాతినిధ్య సంఘం నాయకులు వత్సవాయి కృష్ణంరాజు, సంక్షేమ అధికారి ఓంకారి బాపు, చిట్టా శ్రీనివాస్, భూక్య రాందాస్, సుదర్శన్ రెడ్డి, భార్గవ్, సేఫ్టీ విభాగపు సూపర్వైజర్ కార్తీక్, సిఫ్టీ కమిటీ సభ్యులు పెద్ద ఎత్తున అధికారులు సూపర్వైజర్లు కార్మికులు పాల్గొన్నారు. సింగరేణి రక్షణ పక్షోత్సవాల సందర్భంగా పీకే ఓసి రక్షణ విభాగం ఆధ్వర్యంలో కార్మికులు సైట్ ఆఫీస్ తో పాటు గనిని కూడా సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. నాటిక సమన్వయకర్తగా మునిగల పృధ్వి వ్యవహరించగా కళాకారులు వి ఆదినారాయణ, నరసయ్య, హరిలాల్, సందీప్, ముఖేష్, కనక లక్ష్మి మంగీలాల్, తదితరులు పాల్గొన్నారు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News