మానవ హక్కుల సంఘం రాష్ట్ర నాయకులు
మందడి సంజీవరావు,భద్రాద్రి కొత్తగూడెం జిల్లా
ప్రధాన కార్యదర్శి ఎడెల్లి భవాని శంకర్
మణుగూరు,డిసెంబర్10 వై 7 న్యూస్
హక్కుల దన్నుతోనే ఆత్మగౌరవం నెలకొంటుందని, ప్రజల స్వేచ్ఛకు ఊపిరి మానవ హక్కులే దన్నుగా నిలుస్తున్నాయ
ని, జాతీయ వినియోగదారుల మరియు మానవ హక్కుల పరిరక్షణ సమితి తెలంగాణ రాష్ట్ర సీని
యర్ ఉపాధ్యక్షులు మందడి సంజీవరావు అన్నారు.అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవాన్ని మణుగూరులో సోమవారం ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సంజీవరావు కేక్ కట్ చేసి జిల్లా ప్రధాన కార్యదర్శి భవాని శంకర్ కి తినిపించి అందరికీ అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం సంజీవరావు మాట్లాడుతూ…1948 డిసెంబర్ 10వ తేదీన ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశంలోఅంతర్జాతీయ మానవ హక్కుల ఒప్పందం తీర్మానం చేసినట్లు తెలిపారు. మానవ హక్కుల పరిరక్షణ, హక్కుల అణచివేత లేని సమాజ నిర్మాణం కోసం నిరంతరం సాగాల్సిన కృషికి గుర్తుగా డిసెంబర్ 10న అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవంగా నిర్వహించుకుంటున్నామని తెలిపారు.మనుషులందరికీ పుట్టుకతోనే స్వేచ్ఛ, స్వీయ భద్రత, భావ ప్రకటన స్వేచ్ఛ హక్కుగా ఉంటాయని స్పష్టం చేశారు.చట్టం ముందు అందరూ సమానులేనని పేర్కొన్నారు. మానవ హక్కులను ఉల్లంఘిం చిన వారికి చట్ట ప్రకారం శిక్ష పడుతుందన్నారు. భ్రూణహత్యలు, బాల్య వివాహాలు, మానవ అక్రమ రవాణా, దళితులపై దాడులు జరగకుండా అడ్డుకున్నప్పుడే మానవ హక్కులను పరిరక్షించినట్లవుతుందని
పేర్కొన్నారు.ప్రతి ఒక్కరికీ స్వేచ్ఛ,
వాక్ స్వాతంత్య్రం, సమాజంలో జీవించే హక్కులే మానవ హక్కులని తెలిపారు.
ఈ హక్కులను స్వార్థ ప్రయోజ
నాల కోసం కాకుండా సమాజంలో అట్టడుగున ఉన్న పేద, బలహీనవర్గాలకు ప్రయోజనం కల్పించేలా ప్రతి ఒక్కరూ బాధ్యతలు తీసుకో
వాలని కోరారు. ప్రజల హక్కుల పరిరక్షణ, ప్రజాస్వామ్యస్ఫూర్తిని కాపాడడంలో భారత రాజ్యాంగందే కీలక పాత్ర అని, రాజ్యాంగ నిర్మాతలైనడాక్టర్ బీఆర్ అంబేద్కర్, న్యాయ కోవిదులు, రాజ్యాంగ నిపుణులు, స్వాతంత్య్ర సమరయోధుల సేవలను స్మరించుకోవడం మన కర్తవ్యమని పేర్కొన్నారు.అనంతరం విద్యాహక్కు, జీవించే హక్కు, రక్షణ హక్కు, అభివృద్ధి చెందే హక్కు, భాగస్వామ్యపు హక్కులపై అవగాహన కల్పించారు.