పినపాక ఎంఎల్ఏ పాయం వెంకటేశ్వర్లు
మణుగూరు,డిసెంబర్ 08 వై 7 న్యూస్
పినపాక నియోజకవర్గ అభివృద్ధికి మొత్తంగా సుమారు 758 కోట్ల నిధులు మంజూరు చేయించానని ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు అన్నారు.స్థానిక సింగరేణి ఇల్లందు గెస్ట్ హౌస్ లో పాత్రికేయ సమావేశంలో శాఖల పరంగా సంవత్సర కాలంలో ఖర్చు చేసిన వివరాలను వెల్లడించారు.ఈ సందర్బంగా ఎమ్మెల్యే పాయం మాట్లాడుతూ,నియోజక వర్గంలో అంతర్గత రహదారులు, డ్రైనేజీలు,స్కూల్స్ బిల్డింగులు,బ్రిడ్జిలు, రైతు రుణమాఫీ, రైతులకు బోనస్,కల్యాణ లక్ష్మి షాదీ ముబారక్, పింఛన్లు సహా ప్రభుత్వ సహకారంతో నియోజకవర్గంలో అనేక అభివృద్ధి పనులు చేశానన్నారు.అలాగే రాబోయే నాలుగేళ్లలో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలకు ఎంతెంత బడ్జెట్ కావాలో మంజూరు చేయించి నియోజక వర్గాన్ని మరింత ముందుకు తీసుకెళ్తామని అన్నారు.
పంచాయతీ రాజ్ విభాగంలో సుమారు 633 వర్కులు చేపట్టినట్టు తెలిపారు.సిసి రోడ్లు, డ్రైనేజీలు, అంగన్వాడీ బిల్డింగులు, బిటి రోడ్లు వీటన్నిటికీ 52 కోట్ల 30 లక్షలు నిధులు మంజూరు చేసినట్లు తెలిపారు.తెలంగాణ ఎడ్యుకేషన్ వెల్ఫేర్ డెవలప్మెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ ద్వారా ఈ సంవత్సరం కాలంలో ఎడిషనల్ క్లాస్ రూమ్స్, పాత బిల్డింగ్ రిపేర్లు, కాంపౌండ్ వాల్సు, సైన్స్ ల్యాబ్స్, కిచెన్ షెడ్స్ ,టాయిలెట్స్ షెడ్స్ సంబంధించి 57 కోట్ల 36 లక్షల 55 వేల రూపాయలు నిధులు మంజూరు చేసినట్లు తెలిపారు.అదే విధంగా ఐటీడీఏ ఇంజనీరింగ్ విభాగం నుండి మొత్తం 39 కోట్ల 52 లక్షల రూపాయలు మంజూరు చేసినట్లు తెలిపారు .ఇవన్నీ కూడా స్కూల్స్ ఎడ్యుకేషన్, గార్మెంట్రీ ,సిసి రోడ్లు, అమ్మ ఆదర్శ పాఠశాల అభివృద్ది కి 32 కోట్ల 52 లక్షలు మంజూరు చేయించడం జరిగిందని తెలిపారు.అంతేకాకుండా పినపాక నియోజకవర్గం స్టేట్ డెవలప్మెంట్ ఫండ్ 10 కోట్లతో సీసీ రోడ్లు, డ్రైన్లు, మంచినీటి ట్యాంకులు, పర్మినెంట్ సోర్సెస్,ఎడ్యుకేషన్ సంబంధించిన పనులకు 10 కోట్లు ఖర్చు పెట్టడం జరిగిందన్నారు.మున్సిపాలిటీకి 40 కోట్లు, సింగరేణి సి ఎస్ ఆర్ నిధులు 2 కోట్లు,ఆర్ అండ్ బి కి 9 కోట్ల 30 లక్షలు,ఐ డి డి ఏ సహకారంతో 39 కోట్ల 52 లక్షలు ,ఇరిగేషన్ 89 కోట్ల 30 లక్షలు,పంచాయతీరాజ్ శాఖ 52 కోట్ల 32 లక్షలురైతు రుణమాఫీ 15 వేల 518 మంది రైతన్నలకు 134 కోట్ల 9 లక్షల 51 వేలు,బోనస్ 3 కోట్ల 92 లక్షల 69 వేలు,ఐటిఐ అప్ గ్రేడ్ అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ మణుగూరు, కృష్ణ సాగర్ కు ఐటిఐ లకు 9 కోట్ల 34 లక్షలు , గృహ
జ్యోతి పథకం కింద 39 వేల 81 మంది వినియోగదారులు 1కోటి 56 లక్షల 840 రూపాయలు లబ్ధి పొందారని,గ్యాస్ సబ్సిడీ ద్వారా 35,353 మంది లబ్ధిదారులకు 1కోటి 76వేల రూపాయలు,పెన్షన్ ద్వారా26వేల 713 మంది లబ్ధిదారులకు71 కోటి4 లక్షల 802 రూపాయలు ,కళ్యాణ లక్ష్మి పథకం ద్వారా 837 మంది లబ్ధి దారులకు 8 కోట్ల 37 లక్షల రూపాయలు ,గౌడ కులస్తులకు 85 మందికి కా కిట్లు అందించామని,సింగరేణి లో కారుణ్య నియామకాలు చేపట్టామని, కాంట్రాక్ట్ కార్మికులకు కూడా బోనస్ ఇచ్చామని, సింగరేణి కార్మికులు చనిపోతే ఒక కోటి రూపాయలు ప్రమాద బీమా కల్పించామని తెలియజేశారు. అంగన్వాడి కేంద్రాల్లో చిన్నపిల్లలు ఫ్యాన్ లేక లైట్లు లేక ఇబ్బందులు పడుతున్నారని గమనించి,నియోజకవర్గంలో ఉన్న 361 అంగన్ వాడీ కేంద్రాలకు విద్యుత్ సౌకర్యం కోసం మీటర్లు, ఫ్యాన్లు, లైట్ ల కోసం 9 లక్షల రూపాయలు మంజూరు చేయించి యుద్ధ ప్రాతిపదికన పనులు చేయడం జరుగుతుందని తెలిపారు.ఇటీవల కురిసిన భారీ వర్షాలకు వరద బాధితులకు ఒక్కొక్కరికి 16,500 చొప్పున 2600 కుటుంబాలకు 4 కోట్ల 29 లక్షలు తక్షణ సహాయం ప్రభుత్వ సహకారంతో అందజేశామన్నారు.పులుసుబొంత ప్రాజెక్టు చిరకాల వాంఛ అని ఆ ప్రాజెక్టు కూడా త్వరలోనే ప్రభుత్వ సహకారంతో పూర్తఅవుతుందని అన్నారు. అభివృద్ధిలో వెనుకడుగు వేసే ప్రసక్తి లేదని తెలిపారు. నియోజకవర్గానికి ఏకలవ్య పాఠశాల శాంక్షన్ అయిందని పినపాకలో త్వరలో నిర్మాణం చేపడతామని , నియోజకవర్గానికి యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ మంజూరైందని తెలిపారు. ఈ సందర్భంగా అశ్వాపురం మణుగూరు బస్టాండ్లను త్వరలోనే ప్రారంభిస్తామని అన్నారు. వర్షాకాలం వస్తే మణుగూరు అగ్నిమాపక కేంద్రం లోకి నీళ్లు చేరుకుంటున్నాయని ఆ బిల్డింగ్ కూడా సాంక్షన్ చేసామని అన్నారు. సారపాక నుండి ములుగు వరకు 680 కోట్లతో నాలుగు లైన్ లో రోడ్డు శాంక్షన్ అయిందని అది కూడా అతి త్వరలో పనులు మొదలు పెడతారని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు పిరినకి నవీన్,పట్టణ అద్యక్ష్యులు శివ సైదులు, పినపాక నియోజకవర్గం యువజన నాయకుడు తరుణ్ రెడ్డి, కాటబోయిన నాగేశ్వరరావు,గాండ్ల సురేష్,కొర్సా ఆనంద్, రాజా రత్నం,నరేష్,ముఖ్య నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.