తిరుమలయపాలెం; 08డిసెంబర్ (వై 7న్యూస్)
తిరుమలాయపాలెం మండల పరిధిలోని జల్లేపల్లి గ్రామంలో శనివారం నాడు స్పోర్ట్స్ అథారిటీ తెలంగాణ చీఫ్ మినిస్టర్ కప్ 2024 క్రీడల పోటీలు ఘనంగా నిర్వహించినారు. పల్లెల నుంచి ప్రపంచం వరకు క్రీడల లో విజేతలుగా నిలవాలనే సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు జల్లేపల్లి గ్రామంలో ప్రారంభమైనవి జల్లేపల్లి శివారు ఏడు గ్రామ పంచాయతీల క్రీడాకారులు జల్లేపల్లి లో సెంటరులో ఆడేందుకు వసతులు ఏర్పాటు చేసినారు. కబడ్డీ ఆటలు నిర్వహించినారు అందులో విజేతలుగా కొన్ని టీములు నిలిచాయని పోట్ల కిరణకుమర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ నాయకులు పోట్ల కిరణ్ కుమార్, గ్రామ పెద్దలు అనపర్తి రవి, చిప్పలపల్లి వెంకన్న, హై స్కూల్ హెడ్మాస్టర్ ధార రాజేష్, గ్రామ సెక్రెటరీ ఎన్ రమేష్, అంగన్వాడీ టీచర్స్ ఇరి పద్మ, ఆశా వర్కర్స్ వీరమ్మ, కవిత తదితరులు పాల్గొన్నారు.