బాన్సువాడ డిసెంబర్ 08 వై 7తెలుగున్యూస్
బాన్సువాడ నియెజవర్గంలోని
వర్ని మండలం సిద్దాపూర్ వద్ద నూతనంగా నిర్మిస్తున్న సిద్దాపూర్ రిజర్వాయర్ నిర్మాణ పనులను స్థానిక నాయకులతో కలిసి పరిశీలించిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు, బాన్సువాడ నియోజకవర్గ శాసన సభ్యులు పోచారం శ్రీనివాస రెడ్డి .నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేసి వచ్చే వర్షాకాలం నాటికి పూర్తి స్థాయి లో నీరందించే విధంగా పనుల్లో వేగం పెంచాలని కాంట్రాక్టర్ మరియు సంబంధిత అధికారులను ఆదేశించారు.నిర్మాణ పనుల్లో నాణ్యత లోపం రాకుండా చూసే బాధ్యత సంబంధిత అధికారులు మరియు స్థానిక నాయకులు చూసుకోవాలని సూచించారు.
అనంతరం హన్మాజీపేట్ కొనాపూర్ శివారులో 12 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న
గిరిజన గురుకుల బాలిక పాఠశాల భవన నిర్మాణ పనులను పరిశీలించి వచ్చే జూన్ లోగా భవన నిర్మాణం పూర్తి చెయ్యాలని కాంట్రాక్టర్ కు సూచించారు.పోచారం వెంట స్థానిక నాయకులు ప్రజాప్రతినిధులు అధికారులు ఉన్నారు.