నసుల్లాబాద్ డిసెంబర్ 08 వై 7న్యూస్ తెలుగు
నస్రుల్లాబాద్ మండల కేంద్రంలో బి ఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపుమేరకు శనివారము నస్రుల్లాబాద్ మండల కేంద్రంలో చేపట్టిన గిరిజన గురుకుల బాటను పోలీసులు ప్రిన్సిపాల్ అడ్డుకోవడం పై బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు నిరసన వ్యక్తం చేశారు. గిరిజన గురుకుల పాఠశాల సందర్శినకు వెళ్లిన బి ఆర్ ఎస్ నాయకులను పోలీసులు గురుకుల పాఠశాల సిబ్బంది. అడ్డుకోవడంపై ముండిపడ్డారు. గిరిజన గురుకుల పాఠశాల ఎదుట ఆందోళనకు దిగారు ఈ సందర్భంగా బి ఆర్ ఎస్ మున్సిపల్ వైస్ చైర్మన్ జుబేర్ మాట్లాడుతూ వసతి గృహలలోని వైఫల్యం కప్పిపుచ్చుకోవటానికి పోలీసులు అడుగడుగునా తమను అడ్డుకుంటున్నారని ఆరోపించారు. లోపలికి
అనుమతించకపోవడంతో అక్కడే బయటాయించారు. సర్కార్ కు వ్యతిరేకంగా నిదానాలు చేశారు బి ఆర్ ఎస్ నాయకులు కార్యకర్తలతో కలిసి స్పందించారు. మండల కేంద్రంలోని గిరిజన గురుకుల పాఠశాలకు వెళ్లగా పోలీసులు అడ్డుకోవడంతో ఆగ్రహం వ్యక్తం చేస్తూ గేటు ఎదుట బైఠాయించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ జుబేర్, బి ఆర్ఎస్ సీనియర్ నాయకులు అఫ్రోజ్, జి నరసింహులు గౌడ్, టేకుర్ల సాయిలు, డి సాయిలు, సీనియర్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.