E-PAPER

వికలాంగుల హక్కుల వేదిక జెండా ఆవిష్కరించిన సిఐటియు జిల్లా కమిటీ సభ్యులు సురేష్ గోండ

బిచ్కుంద డిసెంబర్ 08 వై సెవెన్ న్యూస్ తెలుగు

బిచ్కుంద మండల కేంద్రంలో జాతీయ వికలాంగుల హక్కుల వేదిక ఆధ్వర్యంలో అంబేద్కర్ చౌరస్తా కూడలిలో వికలాంగుల హక్కుల వేదిక జెండా ఆవిష్కరణ సీఐటీయూ జిల్లా కమిటీ సభ్యులు సురేష్ గొండ ఎగరవేశారు అనంతరం బిచ్కుంద తాసిల్దార్ కి వికలాంగుల డిమాండ్లతో కూడిన వినతి పత్రం ఇవ్వడం జరిగింది.ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కమిటీ సభ్యులు సురేష్ గొండ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం వికలాంగ సోదరులకు. ఆరువేల రూపాయలు జీవన భృతి పెన్షన్ ఇస్తామని చెప్పిన హామీని అమలు చేయాలని వికలాంగులకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి. వీరికి కార్పొరేషన్ ద్వారా 5 లక్షల రుణ సౌకర్యం కల్పించాలని. చదువుకున్న వికలాంగ సోదరి సోదరులకు. ప్రభుత్వ నియమాకాలలో అర్హులైన వారికి ఉద్యోగ అవకాశం కల్పించాలని ఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు వికలాంగ సోదరి సోదరులకు. డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు. ఇండ్ల స్థలాలు. వికలాంగ సోదరులకు. మూడు చక్రాల రిక్షా తో పాటు. మూడు చక్రాల. స్కూటీలు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో. బిచ్కుంద మండల అధ్యక్షులు. సంగప్ప. ఆమద్. నారాయణ. సిహెచ్. హోసన్న. సాయిలు వికలాంగ సోదరి సోదరులు పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్