E-PAPER

108 మంది లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ చేసిన ఎమ్మెల్యే పోచారం

బాన్సువాడ డిసెంబర్08 వై సెవెన్ న్యూస్

బాన్సువాడ కేంద్రంలోని తన నివాసంలో బాన్సువాడ నియోజక వర్గానికి చెందిన 108 మంది ముఖ్యమంత్రి సహాయ నిది లబ్ధిదారులకు చెక్కులను శనివారం తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ సలహాదారులు, బాన్సువాడ నియోజక వర్గ శాసన సభ్యులు పోచారం శ్రీనివాసరెడ్డి,రాష్ట్ర ఆగ్రోస్ చైర్మన్ కాసుల బాలరాజుతో కలిసి అందజేశారు. ఈ సందర్భంగా పోచారం మాట్లాడుతూ మొత్తం ఒక్క 100 ఎనిమిది లబ్ధిదారులకు గాను రూ 34,47,500 ల చెక్కులను అందజేసినట్లు తెలిపారు.మండలాల వారిగా సీఎంఆర్ఎఫ్ లబ్ధిదారులు బాన్సువాడ గ్రామీణ మండలలోని 20మంది లబ్ధిదారులకు రూ 5,36, 000లు, బాన్సువాడ మున్సిపాలిటీలో 14 మంది లబ్ధిదారులకు రూ 6,16, 000లు, బిర్కూర్ మండలం 14 మంది లబ్ధిదారులకు రూ 3,71, 000లు, నసురుల్లబాద్ మండలం 11 మంది లబ్దిదారులకు రూ 3,20, 000లు,మొస్రా మండలం ముగ్గురు లబ్దిదారులకు రూ 80, 000లు,చందూర్ మండలం 5 గురు లబ్దిదారులకు రూ 1,69, 500లు,వర్ని మండలం 19 మంది లబ్దిదారులకు రూ 6,52, 500లు,రుద్రుర్ మండలం 13 మంది లబ్దిదారులకు రూ 3,73, 500లు,కోటగిరి మండలం 8 మంది లబ్దిదారులకు రూ 3,16, 000లు, పొతంగల్ మండలం ఒక్కరికి రూ 13, 000లు, ఇలా మొత్తం నియోజక వర్గం లో 108 మంది సీఎంఆర్ఎఫ్ లబ్ధిదారులకు గాను రూ 34,47, 500లు అందజేసినట్టు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపాలిటీ చైర్మన్ జంగం గంగాధర్, బాన్సువాడ నియోజక వర్గ ప్రజాప్రతినిధులు, నాయకులు, లబ్ధిదారులు పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్