బాన్సువాడ డిసెంబర్ 08 వై సెవెన్ న్యూస్
బాన్సువాడ పట్టణ కేంద్రం లో చట్టాలపై ప్రతి ఒక్కరికి అవగాహన ఉండాలని బాన్సువాడ జూనియర్ సివిల్ జడ్జి కోర్టు టీఎస్పీ భార్గవి అన్నారు. బాన్సువాడలో శనివారం మండల న్యాయ సేవాధికార కమిటీ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. చిన్న చిన్న ఘటనల్లో ఒకరిపై ఒకరు కేసులు నమోదు చేసుకోవడం ద్వారా డబ్బుతో పాటు సమయం వృథా అవుతుందన్నారు. ఈనెల 14న జాతీయ లోక్ అదాలత్ ద్వారా కేసులు రాజీ చేసుకోవచ్చన్నారు. కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు లక్ష్మీనారాయణమూర్తి, పట్టణ సీఐ అశోక్, న్యాయవాదులు భూషణ్ రెడ్డి, లక్ష్మారెడ్డి, ఖలీల్, మొగులయ్య, అజీమ్, అయ్యల ఆనంద్ తదితరులు పాల్గొన్నారు.
Post Views: 17