మణుగూరు,డిసెంబర్07 వై 7 న్యూస్
తెలంగాణ వడ్డెర సంఘం మరియు చారిటబుల్ ట్రస్ట్ రాష్ట్ర అధ్యక్షులు చైర్మన్ శివరాత్రి అయిలమల్లు ఆదేశాల మేరకు వడ్డెర ఎస్టీ సాధనకై ఎమ్మెల్యేలకు వినతి పత్రాలు అందించే కార్యక్రమంలో భాగంగా శనివారం పినపాక నియోజకవర్గ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లుని వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి వినతి పత్రం అందజేశారు.రాష్ట్ర కార్యదర్శి గుర్రం శ్రీనివాస్ మాట్లాడుతూ అణగారిన తెలంగాణ వడ్డెర నవ్య తెగ, గత 44 సంవత్సరాలుగా ఎస్టీ డిమాండ్ కోసం పోరాడుతున్నామని,ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హయాంలో అప్పటి ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి వడ్డెర కులాన్ని ఎస్టిలో చేర్పిస్తామని బహిరంగ సభలో ప్రకటించారని,అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో రాహుల్ గాంధీ వడ్డెర కులాన్ని ఎస్టీ జాబితాలో చేరుస్తామని బహిరంగ సభలో ప్రకటించారన్నారు.కాంగ్రెస్ పార్టీ 2023 మేనిఫెస్టోలో వడ్డెర కులానికి వడ్డెర కార్పొరేషన్ ఏర్పాటు చేసి సరిపడా నిధులు ఇస్తానని మేనిఫెస్టోలో పొందుపరిచారని గుర్తు చేశారు.గతంలో జరిగిన తెలంగాణ మంత్రివర్గ సమావేశంలో 16 కులాలకు కార్పొరేషన్ ఏర్పాటు చేసిన రాష్ట్ర ప్రభుత్వం వడ్డెర కులానికి కార్పొరేషన్ ఏర్పాటు చేయకపోవడం గమనార్హం అని రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడి 11 నెలలు గడిచి రెండు సార్లు అసెంబ్లీ సమావేశాలు పలు మార్లు మంత్రివర్గ సమావేశాలు జరిగినా, ఎక్కడ వడ్డెర కులం గురించి వడ్డెర కార్పొరేషన్ గురించి ప్రస్తావించకపోవడం బాధాకరం అని రానున్న శీతాకాల అసెంబ్లీ సమావేశాల్లో వడ్డెర కులాన్ని ఎస్టీలుగా తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపాలని డిమాండ్ చేస్తూ ఎమ్మెల్యేకు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు పెనుగొండ సాంబశివ జిల్లా ప్రధాన కార్యదర్శి తురక మదు, ఆశ్వపురం మండల అధ్యక్షుడు దేరంగుల వెంకన్న, పినపాక నియోజక వర్గం అధ్యక్షులు వేముల లక్షమయ్య, అశ్వపురం యూత్ కమిటీ సభ్యులు దేవండ్ల అనిల్ ,దేరంగుల రమేష్ మరియు బూర్గంపాడు మండలం అధ్యక్షుడు తమ్మిశెట్టి ఏసు పాదం కుల పెద్దలు పాల్గొన్నారు…









