కొత్తగూడెం,డిసెంబర్07 వై 7 న్యూస్;
మహిళా శక్తి భవన సముదాయాల నిర్మాణం కోసం లక్ష్మీదేవిపల్లిలోని ఇల్లందు క్రాస్ రోడ్ లో కేటాయించిన స్థలాన్ని శనివారం జిల్లా కలెక్టర్ జితేష్ వి.పాటిల్ పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా పంచాయతీరాజ్ ఇంజనీర్ శ్రీనివాస్ రావును అక్కడ చేపట్టబోయే నూతన భవన నిర్మాణ అంచనాలను అడిగి తెలుసుకున్నారు. మహిళా శక్తి భవనాలకు రూ 5. కోట్ల వ్యయ అంచనాలను రూపొందించినట్లు తెలిపారు. అత్యంత విశాలమైన భవనాన్ని ఏర్పాటు చేయాలని అధికారుల ఆదేశించారు. మహిళా శక్తి భవనాలు అందుబాటులోకి వస్తే స్వయం సహాయక సంఘాలకు ఎంతగానో దోహదపడతాయని అన్నారు. కలెక్టర్ వెంట పంచాయతీ రాజ్ ఏఈ శివలాల్,సిబ్బంది శ్రీనివాస్ తదితరులు ఉన్నారు..
Post Views: 35