ములుగు,డిసెంబర్04 వై 7 న్యూస్
జలగలంచ బ్రిడ్జి మీద లారీ మరియు బస్సు ఢీ కొన్న ఘటన బుధవారం సాయంత్రం జరిగింది.బ్రిడ్జి మీద పెద్ద వాహనములు ప్రమాదానికి గురై ఉండడం వలన ట్రాఫిక్ అంతరాయము ఉన్న కారణంగా పసర నుండి తాడ్వాయి, ఏటూరునాగారం, మంగపేట వెళ్లే వాహనములు పసర వద్ద మేడారం వైపు వెళ్లి మేడారం మీదుగా తాడ్వాయి వరకు రావాలని, అలాగే ఏటూరు నాగారం, తాడ్వాయి నుండి పసరా వైపు వెళ్లే వాహనములు కుడి వైపు తీసుకుని మేడారం వెళ్లి మేడారం మీదుగా పసరా వెళ్లాలని తాడ్వాయి ఎస్ఐ శ్రీకాంత్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు.
Post Views: 389









