అశ్వాపురం,డిసెంబర్04 వై 7 న్యూస్
ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ ఫ్రం సెక్సువల్ అఫెన్సెస్(పోక్సో)కేసులో అశ్వాపురం మండలం రామచంద్ర పురానికి చెందిన యువకుని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించినట్లు సిఐ అశోక్ తెలిపారు. మైనర్ బాలికపై లైంగిక దాడికి పాల్పడినందున అరెస్టు చేయడం జరిగింది. మైనర్ బాలికల పట్ల అనుచితంగా వ్యవహరించే వారిని ఉపేక్షించేది లేదని కఠినమైన చట్టాల కింద కేసులు నమోదు చేయడం జరుగుతుందని తెలిపారు. కావున అందరూ చట్టాలపై అవగాహన పెంచుకొని ఆడపిల్లల పట్ల గౌరవంగా వ్యవహరించాలని తెలిపారు
Post Views: 324