E-PAPER

జ్వాలా ట్రస్ట్ సభ్యులను సన్మానించిన జన విజ్ఞాన వేదిక ములుగు జిల్లా కమిటి

ములుగు,డిసెంబర్04 వై 7 న్యూస్;

జ్వాలా ట్రస్ట్ మంగపేట వారికి జాతీయ స్థాయిలో అవార్డు వచ్చిన సందర్బంగా జనవిజ్ఞాన వేదిక ములుగు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో వారికి సన్మానం జరిగింది. ఈ సందర్బంగా జన విజ్ఞాన వేదిక రాష్ట్ర కార్యదర్శి కొండా చెంచయ్య మాట్లాడుతూ జ్వాలా ట్రస్ట్ అధ్యక్షులు కోడెల నరేష్ ,జన విజ్ఞాన వేదిక సామాజిక న్యాయ విభాగం జిల్లా కన్వినర్ గా కూడ సేవలు అందించారాని అలాగే జ్వాలా ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి మునిగాలా రాకేష్ కూడ జన విజ్ఞాన వేదిక ఆరోగ్య విభాగం జిల్లా కన్వినర్ గా కూడా సేవలు అందించారని తెలుపుతూ వారి సేవలను కొనియాడారు.జన విజ్ఞాన వేదిక ములుగు జిల్లా గౌరవ అధ్యక్షులు కలకొట్ల నరేష్ రెడ్డి మాట్లాడుతూ జ్వాలా ట్రస్ట్ కూ అవార్డ్స్ దక్కడం తో బాధ్యత మరింత పెరిగింది అని పేర్కొన్నారు.. ఈ కార్యక్రమం లో గడ్డి శ్రీనివాస్ జన విజ్ఞాన వేదిక జిల్లా ప్రధాన కార్యదర్శి, జడ్ పి హెచ్ ఎస్ ప్రధానోపాధ్యాయులు కమలాపురం, యు టి ఎఫ్ రాష్ట్ర నాయకులు గొప్ప సమ్మరావ్ జన విజ్ఞాన వేదిక జిల్లా గౌరవ అధ్యక్షులు నరేష్ రెడ్డి ఉపాధ్యాయులు జ్వాలా ట్రస్ట్ అధ్యక్షులు కోడెల నరేష్ కు ప్రధాన కార్యదర్శి మునిగాలా రాకేష్ కు సలహా దారులు నరేష్ రెడ్డి రవి,బాబా,రాజేష్, మహేష్ గార్లకు సన్మానం చేశారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్