E-PAPER

బోదకాలు(ఫైలేరియా) బాధితులకు పది వేల రూపాయలు పెన్షన్ ఇవ్వాలి

ఏఐపీకేఎంఎస్ ఖమ్మం జిల్లా కార్యదర్శి తిమ్మిడి హనుమంతరావు

పాలేరు, నవంబర్ 28: వై 7 న్యూస్

తెలంగాణ రాష్ట్రంలోని 33 జిల్లాలో బోదకాలు (ఫైలేరియా) వ్యాధిగ్రస్తులు చాలామందికి పెన్షన్లు రావట్లేదని వారందరికీ పెన్షన్ వచ్చే విధంగా రాష్ట్ర ప్రభుత్వం తగు చర్యలు తీసుకోవాలని సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ (ప్రజాపంద) అనుబంధ అఖిలభారత ప్రగతిశీల వ్యవసాయ కార్మిక సంఘం (ఏఐపీకే ఎంఎస్) ఖమ్మం జిల్లా ప్రధాన కార్యదర్శి తిమ్మిడి హనుమంతరావు డిమాండ్ చేశారు.గురువారం నాడు తిరుమలాయపాలెం మండల పరిషత్ అభివృద్ధి అధికారి సిల్వర్ సాహెబ్ కి వినతిపత్రం ఇచ్చి ఈ విధంగా మాట్లాడుతూ బోదకాలు పైలేరియా బాధితులకు ఉచితంగా మందులు, దోమతెరలు, వికలాంగులుగా గుర్తించి సదరం సర్టిఫికెట్లు ఇవ్వాలని.పరీక్షలు, దోమలు కుట్టకుండా పుట్టకుండా చేయాలని,తిరుమలాయపాలెం మండలంలో ఆసరా పెన్షన్లు రాని వృద్ధులు, వికలాంగులు,ఒంటరి మహిళలు,గీత, చేనేత, వ్యవసాయ కార్మికులకు పదివేల రూపాయలు ఇవ్వాలని అన్నారు.బోదకాలు బాధితులతో పాటు ఇతర పెన్షన్ దారులకు అందరికీ పెన్షన్లు ఇచ్చే విధంగా ప్రభుత్వం తగు చర్యలు తీసుకోవాలని లేనియెడల ప్రజా పోరాటాలు చేస్తామని తిమ్మిడి హనుమంతరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బోదకాలు బాధితులు బొర్రాజు పార్వతమ్మ,పేర్ల సౌనమ్మ,గొర్రెపాటి నాగమ్మ,దారముల వెంకన్న,బొల్లం పిచ్చమ్మ, బల్లం విజయ,గొర్రెపాటి వీరయ్య,గొర్రెపాటి రామచంద్రు,తిమ్మిడి రఘుబాబు,జిల్లా నాగమణి,తిమ్మిడి రజిత,గొర్రెపాటి ధనమ్మ,పులి పల్పుల వెంకటమ్మ,బుర్ర విజయ తదితరులు పాల్గొన్నారు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News  

error: Content is protected !!