పాలేరు, నవంబర్ 28: వై 7 న్యూస్
మహాత్మ జ్యోతిరావు పూలే వర్ధంతిని ఖమ్మం జిల్లా కాంగ్రెస్ కార్యాలయం అయిన సంజీవ రెడ్డి భవన్ లో జ్యోతిరావు పూలే చిత్ర పాఠనికి పూలమాల వేసి నివాళులర్పించిన పాలేరు నియోజకవర్గ యువజన కాంగ్రెస్ ఉపాధ్యక్షులు భూక్యా సురేష్ నాయక్.అనంతరం అయన మాట్లాడుతూ,అణగారిన వర్గాలకు అందని ద్రాక్షగా ఉన్నటువంటి విద్యను మాత సావిత్రిబాయి పూలే తో పాఠశాలలు ప్రారంభించి దిక్కు మొక్కు లేని ప్రజలకు విద్యను ఆయుధంగా చేసుకుని ఆడపిల్లలకు రక్షణగా ధైర్యం కల్పించడం జరిగిందన్నారు. జ్యోతిరావు పూలే కులాల కతీతంగా బ్రాహ్మణిజానికి వ్యతిరేకంగా పోరాటం చేసి గొప్ప సంఘ సంస్కర్త గా బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి గా సామాజిక అసమానతల మీద అలుపెరుగని పోరాటం చేసి విద్యాభివృద్ధికి ఉద్యమించిన ఆదర్శప్రాయుడు భావితరాలకు స్ఫూర్తిగా నిలిచిపోయారన్నారు.
Post Views: 35