హుజూర్ నగర్ నవంబర్ 28 వై 7 న్యూస్
రహదారి భద్రతను పాటించాల్సిన బాధ్యత ప్రజలందరికీ అని ఎస్సై ముత్తయ్య, ప్రిన్సిపల్ పోసాని వెంకటరమణారావు అన్నారు. పట్టణంలోని శ్రీ చైతన్య పాఠశాల ఆధ్వర్యం లో సేఫ్ ఇండియా అనే అంశంపై గురువారం నిర్వహించిన అవగాహన ర్యాలీలో పాల్గొని మాట్లాడారు. ప్రజలందరూ ట్రాఫిక్ నిబంధనలను పాటించి రోడ్డు ప్రమాదాలను నివారించాలని సూచించారు. స్వయంకృతాపరాధం వల్లే అధికంగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని అన్నారు. మైనర్ల డ్రైవింగ్ ఫై పోలీసుశాఖ దృష్టి సారించిందని రోడ్డు ప్రమాదాలు జరగకుండా నివారించడంలో పోలీసులు బాధ్యతాయుతంగా వ్యవహరిస్తున్నారని తెలిపారు. వాహనదారులకు గులాబీ పూలను అందించి హెల్మెట్ ధరించాలని విద్యార్థులు కోరారు. ఈ కార్యక్రమంలోడీన్ ప్రేమ్ సాగర్,
ఎ ఎస్ ఐ రమేష్,ఉపాధ్యాయులు, విద్యార్థులు పోలీస్ అధికారులు పాల్గొన్నారు.
Post Views: 31